నల్తూర్ మొహరం వేడుకలో పీర్లకు దట్టిలను సమర్పించిన కాటా శ్రీనివాస గౌడ్

మొహరం పండుగ త్యాగానికి, ఐక్యతకు, మతసామరస్యానికి ప్రతీక అని అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మొహరం వేడుకల సందర్భంగా జిన్నారం మండలం నల్తూర్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు పాల్గొని పీర్లను దర్శించుకుని దట్టిలను సమర్పించిన అనంతరం మత పెద్దలు ఆయనను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రెసిడెంట్స్ వడ్డె క్రిష్ణ, నర్సింగ్ రావు, ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్. ఎంపీటీసీలు నాగేందర్ గౌడ్, జనాభాయి, గోవర్ధన్ గౌడ్, ప్రతాప్ రెడ్డి, ఉపసర్పంచ్ రమేష్, చంద్రయ్య, గ్రామ అధ్యక్షుడు రాజు, సురేష్, లక్ష్మణ్, జె రాజు, శ్రీకాంత్, కె ఎస్ జి యువసేన సభ్యులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *