
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 160 దుకాణాల సముదాయం నిర్మాణ పనులకు పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, శ్రీమతి పుష్ప నగేష్ గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.