
“స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ తారీక్ – ఏక్ గంట – ఏక్ సాత్” కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం అమీన్పూర్ బైపాస్ రోడ్డు నందు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. అమీనుపూర్ బైపాస్ రోడ్ పరిసరాల్లో ప్రజలకు అవగాహన కల్పించేలా పరిశుభ్రత పనులు చేపట్టారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ ఏ.జ్యోతి రెడ్డి, RO వెంకట రామయ్య AE ప్రవీణ్, DE వెంకటరమణ,కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మ్యకం మల్లేష్, చోటకూరి మైపాల్ రెడ్డి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.