వందనపురిలో శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతుల రాకతో పండుగలా సాగిన ఆత్మీయ సమావేశం!!

అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీ రోడ్ నెంబర్ 8 లో 11-10-2023 తేదీ బుధవారం రోజు రాత్రి 8-30 గంటలకు జరిగిన ఆత్మీయ సమావేశంలో పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్న శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు సతీ సమేతంగా వందనపురి రామాలయంలో శ్రీ రాముల వారిని దర్శించుకొని, ఆశీర్వచనం పొంది, అక్కడ నుండి భరత్ నగర్ కాలని సమావేశంలో పాల్గొన్నారు. తదుపరి వందనపురి కాలని రోడ్ నెంబర్ – 8లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని కార్యక్రమానికి పండుగ వాతావరణం తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో అమీనుపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి.శశిధర్ రెడ్డి గారు కూడా సతీ సమేతంగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు S. వెంకటేశ్వర రావు గారు స్వాగతం పలికారు. ముఖ్య అతిథి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని వందనపురి నాయకులు శ్రీ పి. మనోహర్, శ్రీ పి. లక్ష్మీనారాయణ యాదవ్ గారు శాలువాతో సత్కరించారు. అమీనుపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ.జి. శశిధర్ రెడ్డి గారిని శ్రీ డి.ఎల్.వి. శ్రీనివాస్, శ్రీ దాసరి శ్రీధర్ గారు శాలువాతో సత్కరించారు.కౌన్సిలర్స్ శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్, శ్రీమతి లావణ్య గారిని వందనపురి మహిళామణులు శ్రీమతి ప్రభావతి, శ్రీమతి జయ, శ్రీమతి నళిని, శ్రీమతి విజయ, శ్రీమతి మల్లారావు గారు శాలువాలతో సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ గారిని శ్రీకాంత్ రెడ్డి గారు శాలువాతో సత్కరించారు. వందనపురి కాలనీకి గతంలో శ్రీనన్న చేసిన అభివృద్ధి పనులకు (రెండు నీటి సంపులు, 25 అపార్ట్మెంట్స్ కు నీటి కనెక్షన్స్, సి సి రోడ్లు మొ||) ధన్యవాదాలు తెలిపారు S. వెంకటేశ్వర రావు గారు. రాబోయే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన పిదప మా కాలనీకి ఏమి కావాలో మీతో అప్పుడు చెప్పి చేయించుకుంటామని భరోసాగా వందనపురి కాలనీవాసులు చెప్పడంతో శ్రీనివాస్ గౌడ్ గారు ఆశ్చర్యపోయారు. మా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో నన్ను గెలిపించండి. మీరు కోరిన అభివృద్ధి కార్యక్రమాలు చేయటానికి నేను సిద్ధం అంటూ శ్రీనివాస్ గౌడ్ గారు తమ ప్రసంగంలో ప్రస్తావించారు. అమీనుపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి గారు తమ ప్రసంగంలో GHMC పరిధిలో మెట్రో వాటర్ వర్క్స్ వారు ఉచితంగా ఇస్తున్న 20 వేల లీటర్ల గురించి ప్రస్తావిస్తూ, మన అమీనుపూర్ మున్సిపాలిటీలో కూడా ఈ ఉచిత నీటి సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న 15 వార్డు కౌన్సిలర్ శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గారు తమ ప్రసంగంలో వందనపురి సమస్యలు ఏవి వచ్చినా, వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. 13 వార్డు కౌన్సిలర్ శ్రీమతి లావణ్య శశిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీనన్నకు మీ మద్దతు తెలిపి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో D.L V. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ శ్రీనన్న గెలుపు జాతకరీత్యా కూడా యదార్థం అవుతుందని అన్నారు. వందనపురి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమానికి చాలా మంది అపార్ట్మెంట్స్ వాసులు విచ్చేశారు. బ్యాంక్ కాలని టీమ్ వారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాంక్ కాలని మాధవ్ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు జనాల చప్పట్లతో, ఆహ్లాదకరంగా సాగింది. కాలనీ అంతా ఒకే కుటుంబం అనే భావన కలిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కాలనీవాసులకు, మహిళలకు S వెంకటేశ్వర రావు గారు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *