విచిత్రమైన ఊర్ల పేర్లు! సరదాగా నవ్వుకోండి!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: కొన్ని ఊర్ల పేర్లు విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలంటి కోవకు చెందిన రెండు ఊర్ల పేర్లు చూసి సరదాగా నవ్వుకోండి! ఈ రెండు ఊర్లు భద్రాచలం జిల్లాలో ఉన్నాయి ఈ ఊర్ల పై భలే జోకులు ఉంటాయి.

తంత, తన్నించుకుంట

తంతానికి ఒక టికెట్ ఇవ్వండి.
తన్నించుకుంటానికి రెండు ఇవ్వండి.

సార్ చిల్లర ఇవ్వలేదు.
తంతానికి వెళ్ళేవాడికే ఇవ్వలేదు.నువ్వు తన్నిం చుకుంటానికి కదా!
చివరిదాకా వస్తావు కదా!
కంగారుపడకు.

వెనుకసీట్లో అయన : ఏరాబ్బాయి! ఈ మధ్య తంతానికి రావట్లేదు.

లేదు బాబాయ్! తన్నించు కుంటానికి వెళ్లిపోతున్నా బాబాయ్.
అక్కడ ఆర్డర్లు వస్తున్నాయి.

సరేరా! తన్నించు కుంటా అలవాటు అయిపోయి, తంత మాటే మరిచిపోయావు,

ఇంతలోడ్రైవర్ : తంతానికి ఎవరైనా వున్నారా?

కండక్టర్ : ఒక్కరే తంతానికి, అందరు తన్నించుకుంటానికే.
బాబూ తన్నించుకుంటానికి అందరు టికెట్లు చేత్తో పట్టుకోండి.

అప్పుడే మెలుకువ వచ్చిన పాసింజర్ : తంతానికి దిగాలి ఇప్పుడు ఎలా?

కండెక్టర్ విసుగ్గా : ఇంకో ఇరవై ఇచ్చి తన్నించు కుంటానికి దిగు

బస్ దిగుతూ బాబాయ్ పిన్నిని తీసుకుని ఒకసారి తన్నించుకుంటానికి రండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *