లక్డారం శ్రీ వెంకటేశ్వర దేవాలయ రాజగోపుర కుంభాభిషేకం, శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కాటా దంపతులు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ రాజగోపుర కుంభాభిషేక శివపంచాయతన అభయాంజనేయ స్వామి స్థిర ప్రతిష్ట మరియు శిఖర ప్రతిష్ట మహోత్సవంలో పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ కాటా శ్రీనివాస గౌడ్ మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధారాణి గారు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో శ్రీ కాటా శ్రీనివాస గౌడ్ దంపతులను ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *