ఛత్ పూజ ముగింపులో సాఖీ చెరువు కట్టపై సూర్య భగవాన్ దేవాలయానికి ఎమ్మెల్యేతో శంఖుస్థాపన

50 లక్షల రూపాయల సొంత నిధులతో సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఉత్తర భారతీయుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, గతంలో ఇచ్చిన హామీ మేరకు 50 లక్షల రూపాయల సొంత నిధులతో పటాన్ చెరు సాకి చెరువు కట్టపైన సూర్య భగవాన్ దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఉత్తర భారతీయులు సూర్య భగవానుడిని ఆరాధిస్తూ నిర్వహించే చత్ పూజ ఉపవాస దీక్షల ముగింపు సందర్భంగా పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడి దేవాలయం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్ చెరు ప్రాంతం నిలుస్తోందని తెలిపారు. నియోజకవర్గంలో నివసిస్తున్న ఉత్తర భారతీయుల సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో తగు ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారి అభివృద్ధికి అండగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ కుమార్, గూడెం విక్రం రెడ్డి, పృథ్వి రాజ్, శ్రీధర్ చారి, ఉత్తర భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *