
ఇంద్రధనుస్సు ప్రతినిధి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతెలుగు వారి కోసం ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారు సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీని నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలో పాల్గొనటానికి అక్టోబర్ 15 నుంచి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పైన ఇవ్వబడిన ఇమేజ్ నందు ఇవ్వబడిన లింక్ ద్వారా పూర్తి వివరాలు, నియమ నిబంధనలు తెలుసుకోవచ్చు! మీరు వేసే ముగ్గును ఒక నిమిషం నుండి రెండు నిమిషాల వీడియో తీసి పంపవలెను.
మొదటి బహుమతి : రూ. 25,00,116/-
రెండవ బహుమతి : రూ. 15,00,116/-
మూడవ బహుమతి : రూ.10,00,116/-
నాల్గవ బహుమతి : రూ. 5,00,116/-
అయిదవ బహుమతి : రూ. 2,00,116/-
ఇతర ప్రైజులు : రూ. 10,116 చొప్పున 100 ప్రైజులు
ముగ్గుల వీడియోలు పంపటానికి తేదీలు: డిసెంబర్ 1, 2024 నుంచి జనవరి 15, 2025 లోగా పంపాలి.
సమాచారం సేకరించి పంపిన వారు: కె. కుమార స్వామి, వందనపురి కాలని, బీరంగూడ