
పటాన్ చెరు నియోజకవర్గంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే జిఎంఆర్ !
రోడ్ల నిర్మాణానికి 20 కోట్ల 86 లక్షల రూపాయల నిధుల మంజూరు
పటాన్ చెరు నియోజకవర్గంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే జిఎంఆర్
రోడ్ల నిర్మాణానికి 20 కోట్ల 86 లక్షల రూపాయల నిధుల మంజూరు
ఇంద్రధనుస్సు ప్రతినిధి: నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా సి ఆర్ ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో నూతన రోడ్ల నిర్మాణానికి 20 కోట్ల 86 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని నందిగామ నుండి బానూరు గ్రామం వరకు కోటి రూపాయలు అంచనా వేయడంతో నిర్మించతలపెట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.
అనంతరం నందిగామ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 50వేల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, గోపాల్, శ్రీశైలం యాదవ్, ఎంపీడీవో యాదగిరి, పంచాయతీరాజ్ విభాగం డి ఈ సురేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.