ఎల్.ఐ.జి కమ్యూనిటీ హాల్ లో సామూహిక సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్న “కాట దంపతులు”

ఇంద్రధనుస్సు ప్రతినిధి: భారతీనగర్ 111 డివిజన్ పరిధిలోని ఎల్.ఐ.జి కమ్యూనిటీ హాల్ లో శ్రీ వామన బట్ల “ప్రకాశ శర్మ” పంతులు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం” పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు విచ్చేశారు. కార్తీక మాసంలో చివరిగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో దంపతులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కతా శ్రీనివాస్ గౌడ్ దంపతులను అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి వారిని ఘనంగా సన్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *