


ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కంచుకోటలా నిలబెట్టిన ధీరుడు, పార్టీ కార్యకర్తల కోసం తెగువ చూపించే పోరాట యోధుడు, ఆపద అని ఎవరు వచ్చినా ఆపన్న హస్తం అందించే మేరునగధీరుడు, మనందరికీ ఆత్మీయత పంచే మనసున్న మంచి నాయకుడు పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద నియోజకవర్గ కార్యకర్తల సమక్షంలో శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
పటాన్ చెరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేషన్ వార్డుల నుంచి అసంఖ్యాకంగా విచ్చేసిన కాంగ్రెస్ అభిమానులు, నాయకులు, కె.ఎస్.జి. సభ్యుల ఆనందోత్సాహాల మధ్య శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదిన కేక్ కటింగ్ ఘనంగా జరిగింది. సభలో పలువురు కాటా అభిమానులు ప్రసంగిస్తూ, వారి గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభిమానులు రక్త దానంలో పాల్గొని బ్లడ్ డొనేషన్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వివిధ రకాలైన పళ్ళను పంపిణీ చేశారు. శ్రీనివాస్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా రోగులకు పళ్ళు పంపిణీ చేయడంతో, వారు ఎంతో సంతోషించారు.
ఈ కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. అమీనుపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్ మున్నా, కొల్లూరి మల్లేష్, బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ బి. సుధాకర్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు బంధంకొమ్ము శ్రీనివాస్, గొల్ల మల్లేష్, లక్ష్మీకాంత్ రావు, మాజీ వార్డు సభుడు ప్రకాష్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మన్నె రవీందర్, ప్రధాన కార్యదర్శులు రమేష్ యాదవ్, సలీం భాయి, నరేంద్రకాలని ఉమాశంకర్, జయలక్ష్మి కాలని శరత్, వాణి నగర్ మహేష్, లక్ష్మి మెడోస్ మల్లేష్, నారాయణ రెడ్డి కాలని శంకర్, శశిధర్, లక్ష్మారెడ్డి, భవానిపురం సత్తిరెడ్డి, టైలర్ కాలని పాషా భాయి, నర్రెగూడెం గిరి, సతీష్ బృందం, నవ్య సైదురెడ్డి, జయలక్ష్మి కాలని వెంకట్, బందంకొమ్ము సత్తెన్న, చుక్కా రెడ్డి, రామచంద్రారెడ్డి, రాము, అప్పారావు, వెంకటేశ్వర రావు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్, డి.ఎల్.వి. శ్రీనివాస్, నాగేష్ మరియు కె.ఎస్.జి. కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.