
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్టపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 9 నుంచి 12 తేదీ వరకు జరుపబోతున్నట్లు అధ్యయన యూనివర్సల్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు స్వామి వారి కళ్యాణం, వివిధ వాహన సేవలు, స్నపన తిరుమంజన సేవ, చక్రస్నానం, ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి. జంట నగరాల నుంచి ఎక్కువ మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. మీరు స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కండి!!