తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు గూడెం సంతోష్ రెడ్డి వివాహం సందర్భంగా స్వామి వారి ఆలయంలో తొలి వివాహ పత్రికను అందించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి వెంకన్న ఆశీస్సులతో పటాన్చెరు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్ వెంట ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ ఎంపీటీసీ రామచంద్రా రెడ్డి, గూడెం సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *