బీరంగూడ గుట్ట శివాలయంలో దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే దంపతులు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: మహా శివరాత్రి సందర్బంగా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని బీరంగూడ గుట్టపై నెలకొన్నప్రముఖ శైవ క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే గూడెం మహాపాల్ రెడ్డి గారు సతీ సమేతంగా విచ్చేసి దర్శనం చేసుకున్నారు. ఎమ్మెల్యే దంపతులచే అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. మహా శివరాత్రి సందర్బంగా కొన్ని లక్షల మంది భక్తులు బీరంగూడ జాతరకు విచ్చేశారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. టి.ఎస్.ఆర్.టి.సి. వారు ఈ జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *