
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్‌చెరు మండలం నందిగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు శ్రీ ఎల్లగోని విక్రమ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహా చండీ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా గారు పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించడంతో పాటు, సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు తోడ్పడతాయన్నారు. దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సేవకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు మా పూర్తి మద్దతు ఉంటుందని” తెలిపారు.