లింగంపల్లి ప్లై ఓవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ఇంద్రధనుస్సు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలో జాతీయ రహదారిపై అశోక్ నగర్ నుండి చందానగర్ వరకు 136 కోట్ల రూపాయలతో నిర్మించిన లింగంపల్లి బీహెచ్ఈఎల్ ఫ్లైఓవర్ ను కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర బొగ్గు గనుల సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, స్థానిక పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. నూతన ఫ్లై ఓవర్ నిర్మాణం ద్వారా పటాన్చెరు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *