స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, జి. శశిధర్ రెడ్డి, స్థానిక నాయకులు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: 79 వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం అమీనుపూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జి. శశిధర్ రెడ్డి గారు పాల్గొన్నారు. 15వ వార్డు పరిధిలోని NRI శ్రీనివాస నగర్ కాలనీలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో జి. శశిధర్ రెడ్డి గారు, కాలనీవాసులు, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
అనంతరం శివాలయం చౌరస్తాలో జరిగిన వేడుకల్లో శ్రీమతి సుధా శ్రీనివాస్ గారు పాల్గొని జెండా ఎగురవేసి, జాతీయ నాయకులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, బీరంగూడ శివాలయం ఛైర్మన్ సుధాకర్ యాదవ్, సభ్యులు రమేష్, లక్ష్మీకాంతరావు, మల్లేష్, ఈశ్వర్ రెడ్డి, భిక్షపతి, మస్తాన్ నాయుడు, రామచంద్రారెడ్డి, కృష్ణయాదవ్, శ్రీనివాస్, శ్రీధర్, ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, నాగేష్ పాల్గొన్నారు.
అనంతరం 13 వార్డు పరిధిలోని SLN హోమ్స్ నందు కాలని అధ్యక్షుడు రామచంద్రారెడ్డి కలిసి శశిధర్ రెడ్డి గారు జాతీయ జెండాను ఎగురవేశారు. SLN హోమ్స్ కాలని కార్యవర్గ సభ్యులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వందనపురి కాలని PRISM స్కూల్ నందు జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. PRISM స్కూల్ అధినేత అబ్దుల్ మజీద్ గారు తమ స్కూల్ కార్యకలాపాలను వివరించారు. ఈ వేడుకల్లో శశిధర్ రెడ్డి గారు పాల్గొనడం ఎంతో సంతోషం కలిగించిందని స్కూల్ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *