
ఇంద్రధనుస్సు ప్రతినిధి: విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో గల శ్రీ శృంగేరి శంకర మఠానికి విచ్చేసిన జగద్గురు దక్షిణామ్నాయ శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని శనివారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఫల సమర్పణ చేసి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను ఆశీర్వదించాలని కోరారు. అతి త్వరలో పటాన్చెరులో నిర్వహించబోయే శ్రీ శివ పార్వతుల కళ్యాణం, విశేష గురువందన సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని స్వామివారికి విన్నవించారు. ఇందుకు సమ్మతించిన జగద్గురు పీఠాధిపతులు తప్పకుండా విచ్చేస్తామని తెలియజేశారు. పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులతో ఎన్నో దేవాలయాలు నిర్మించినట్లు స్వామి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం శంకరమఠం తరపున ఎమ్మెల్యే జిఎంఆర్ కు ప్రత్యేక సన్మానం ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వామనభట్ల ప్రకాశ శర్మ, శృంగేరి పండితులు వ్యాసోజ్జల గోపీకృష్ణ శర్మ, సభాపతి చంద్రప్రకాశ శర్మ తదితరులు పాల్గొన్నారు.