
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్‌చెరు నియోజకవర్గంలో ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అమీన్‌పూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని కాట దంపతులు పూజలు జరిపి, అందరూ బాగుండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.