
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో, కార్తీక మాసం సందర్భంగా శ్రీ రవిచంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో 13 మంది వేద పండితుల సమక్షంలో నిర్వహించిన రాజశ్యామల యాగం భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పవిత్ర యాగ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు హాజరయి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ యాగంలో అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి దంపతులు, ఆలయ ఛైర్మన్ సుధాకర్ యాదవ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయి దర్శనం చేసుకున్నారు.