
ఇంద్రధనుస్సు ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న 44వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా అండర్ 14 బాలుర బాలికల కోకో క్రీడా పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు.
రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు వేదికగా పటాన్ చెరు నిలవబోతోందని తెలిపారు. అనంతరం అండర్ 14 బాలుర విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, రంగారెడ్డి జిల్లా జట్టు రెండవ స్థానంలో, హైదరాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి. అండర్ 14 బాలికల విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో మహబూబ్ నగర్ రెండవ స్థానంలో, నల్లగొండ మూడవ స్థానంలో నిలిచాయి. క్రీడాకారుల కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో ఉచిత వసతి, భోజనం, బహుమతులు అందజేశారు.