కాటా శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన మెదక్ ఎంపి అభ్యర్థి నీలం మధు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటికి మంత్రి కొండా సురేఖ.. నీలం మధు గెలుపుకు కృషి చేయాలని సూచన..
పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని వెల్లడించిన కాటా..

పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నివాసానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తో కలిసి వెళ్లారు.
ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గారితో సమావేశమై వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నీలం మధు గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *