బీట్ రూట్ వలన మన ఆరోగ్యానికి కలిగే లాభాలు

  • బీట్ రూట్ లో నైట్రేట్ లు ఉంటాయి. ఇవి మన శరీరంలో చేరినాక నైట్రైట్లు మరియు మరియు నైట్రిక్ ఆక్సైడ్ వాయువులుగా పరివర్తన చెందుతాయి. ఇవి మన ధమనులను వెడల్పుగా చేసి రక్తపోటు నియంత్రిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ బీట్ రూట్ ను కనుక ఆహారంలో తీసుకుంటే, మూడు రోజులలో రక్తపోటు సాధారణ స్థాయికి వస్తుంది.
  • బీట్ రూట్ లో ఫ్లావనాయిడ్లు, నీటిలో కరిగే పీచుపదార్థాలు మరియు బీటాసయనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వలనే బీట్ రూట్ కి ఆ ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ల వలనే LDL కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చెంది ధమనులలో పేరుకోవు. దీనివలన మన గుండె ఆరోగ్యం చురుకుగా ఉంటుంది.
  • బీట్ రూట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ పెరుగుదలను అరికడతాయి. హార్వార్డ్ యూనివర్సిటీ పరిశోధనలలో, బీట్ రూట్ ను సేవించడం ద్వారా ఊపిరితిత్తుల మరియు చర్మ కాన్సర్ లు నివారించవచ్చని తేలింది. క్యారెట్ మరియు బీట్ రూట్ రసాలను ల్యుకేమియా చికిత్సలో భాగంగా క్రమం తప్పకుండా తీసుకుంటారు.
  • బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. కనుక ఇది పుట్టబోయే బిడ్డ ఎదుగుదలను ప్రోత్సహించి గర్భిణులకు మేలు చేస్తుంది. బిడ్డ యొక్క వెన్ను ఆరోగ్యంగా వృద్ధి చెందడానికి ఇది చాలా ఉపయోగకరమైనది. ఇది శక్తినిచ్చి బిడ్డలో అలసటను తగ్గిస్తుంది.
  • బీట్ రూట్ లోని అధిక నైట్రేట్ మోతాదు శరీరం ఆక్సిజన్ ను అధికంగా తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది మెదడు కణాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దీని వలన మెదడు పనితీరు మెరుగుపడి డిమెన్షియా వంటి రుగ్మతలను నిరోధించడానికి లేదా వాటితో పోరాడటానికి సహాయపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *