పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో ఉప సర్పంచ్ పల్లె శ్రీశైలం గారి కుమారుడు శ్రీకాంత్ గారు నూతనంగా ఏర్పాటు చేసుకున్న జిమ్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్, శివానందం, విక్రమ్ గౌడ్, గోరెమియ, కుమార్ గౌడ్, కె శ్రీను, టి మోహన్, కె రాములు, సి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.