డిసెంబర్ 7న తెలంగాణ శాసన సభకు ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికల తేదీని నిర్దారిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తాత్కాలిక షెడ్యూల్ ఫ్లెక్సీ రూపంలో ప్రకటించారు. తెలంగాణతో పాటు అయిదు రాష్ట్రాల్లో జరగవలసిన అసెంబ్లీ ఎన్నికల కొరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా తేదీలను ప్రకటించవలసి ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కొరకు అన్ని ఏర్పాట్లు (ఈవీఎం తనిఖీలు, ఎన్నికల విధుల్లో సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ) చేయటం కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తాత్కాలిక తేదీలను ప్రకటించారు.

  • నవంబర్ 12 షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
  • నవంబర్ 19 వరకు నామినేషన్ల తుది గడువు
  • నవంబర్ 22 న తుది అభ్యర్థుల జాబితా ప్రకటన
  • డిసెంబర్ 7 న పోలింగ్
  • డిసెంబర్ 11 న ఎన్నికల ఫలితాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *