పటాన్ చెరు టికెట్ ఇవ్వలేదని రేవంత్ ఇంటిని ముట్టడించిన కాటా అభిమానులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బి ఆర్ ఎస్ పార్టీ ఇమేజ్ తగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వస్తుంది అనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మూడవ జాబితా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులను తెచ్చి పెట్టింది. పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ విషయంలో పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పటాన్ చెరు టికెట్ 100 కోట్లకు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డితో పాటు మరి కొందరిపై ఆరోపణలు రావడంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని గురించి గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి అవసరమైన ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుందామని భావిస్తే, పటాన్ చెరు టికెట్ మొత్తానికి వారి ఆశలకు గండి కొట్టినట్లు అయింది. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కాటా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ ఇవ్వకపోవడంతో ప్రజల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. బీరంగూడ జాతీయ రహదారిపై అర్థరాత్రి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫ్లెక్షీలను తగులబెట్టి తమ నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు కాటా అనుచరులు. నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేసి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పటాన్ చెరు టికెట్ విషయంలో తీసుకున్న ఒక పొరపాటు నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఫలితాల రోజు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *