చివరి రోజు పోటా పోటీగా నామినేషన్లు వేసిన ముఖ్యనేతలు! ముగిసిన నామినేషన్ల పర్వం!!

పటాన్ చెరు నియోజకవర్గంలో చివరి రోజు పార్టీల ముఖ్య నేతలు ర్యాలీలు చేస్తూ నామినేషన్లు వేయటానికి రావడంతో పటాన్ చెరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఒక వైపు కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం, మరో వైపు నీలం మధు వర్గం నామినేషన్లు వేయటానికి రావడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకొని, ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు రంగంలోకి దిగి గుంపులను చెదరగొట్టారు.
నామినేషన్ల చివరి రోజు వరకు వచ్చిన మొత్తం నామినేషన్లు 50. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఒక్కొక్కరు రెండు నుంచి మూడు సెట్ల నామినేషన్లు సమర్పించడంతో మొత్తం 50 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజున కాటా శ్రీనివాస్ గౌడ్ మరియు వారి సతీమణి శ్రీమతి కాటా సుధారాణి నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకొని, బి ఫామ్ పొందలేక పోయిన నీలం మధు ముదిరాజ్ చివరికి బహుజన సమాజ్ పార్టీ టికెట్ పొంది ఆ పార్టీ తరపున నామినేషన్ వేశారు. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో, అభ్యర్థులు ప్రచార పర్వంలో వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్ళటానికి సిద్ధం అవుతున్నారు. నామినేషన్ల పరిశీలన 13 వ తేది జరుగుతుంది. 15 వ తేది నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *