భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ కు ఈ రోజు మరియు రేపు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారిని దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయమని తెలిపారు. మంత్రి గారి సూచనల మేరకు జూలై 26, 27 తేదీలు అన్ని స్కూల్స్ కు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.