చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై దిగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఇస్రో!

ఎంతో ప్రతిష్టాత్మకంగా గత నెల 14 వ తేదీన చంద్రుడి మీదికి పంపిన చంద్రయాన్-3 అన్ని అవరోధాలను అధిగమించి చందమామ కక్ష్యలో చేరుకున్న సంగతి మనకు తెలిసిందే! నేటి సాయంత్రం గం.6-04 ని.లకు చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండర్ దిగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇస్రో!! ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. భారతీయులంతా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమం చూడటానికి ఎదురు చూస్తున్నారు. మన ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలించి ల్యాండింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రుడిపై మన ల్యాండర్ దిగాలని కోరుకుందాం! మన శాస్రవేత్తలను అభినందిద్దాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *