పటాన్ చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి?

పటాన్ చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరు? నిన్న మొన్నటి దాకా కాటా శ్రీనివాస్ గౌడ్ గారికే కాంగ్రెస్ టికెట్ వస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా నీలం మధు పేరు టికెట్ రేసులో రావడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది. కాంగ్రెస్ అధిష్టానం పరిశీలనలో నీలం మధు పేరు ఉందని తెలియడంతో కాటా శ్రీనివాస్ గౌడ్ అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. గత అయిదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన శ్రీనివాస్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వని పక్షంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సహకరించేది లేదని కాటా అభిమానులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కాంగ్రెస్ టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరో రోజు వేచి చూడాల్సిందే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *