జిన్నారం మండలం గడ్డపోతారంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నేతలు

అధికార బీఆర్ఎస్ పార్టీకి అసమ్మతి నేతలు ఝలక్ ఇస్తున్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ లో చేరికల సంఖ్య పెరుగుతున్నది. పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామం బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ అశోక్ వారి బృందం 200 మంది ఆ పార్టీని వీడి కాట శ్రీనివాస్ గౌడ్ సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబం మాత్రమే అన్ని రకాలుగా లబ్ది పొందిందని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని అన్నారు. రాష్ట్ర ప్రజానికమంతా మీరు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోరని మార్పు మొదలైంది రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. మీ పాలనపై విరక్తి చెంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ కార్డులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని కమిషన్లు దండుకోవడం తప్ప మరొకటి చేయలేదని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి పతనం ఖాయమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్ని వర్గాల ప్రజలకు సమాన అభివృద్ధి లభిస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *