గుంతకల్ నియోజకవర్గంలో ఇద్దరు బీసీ నేతలు ఒకటవుతారా?

ఇంద్రధనుస్సు ప్రతినిధి: జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైఎస్ఆర్ సీపీ నేత  డేరంగుల ఉదయ్ కిరణ్ మంత్రి గుమ్మనూరు జయరామ్ కు మద్దతు నిలబడతాడా  లేదా అనేది చర్చనీయాంశమైంది. గుంతకల్ నియోజకవర్గంలో టిడిపి నుంచి పోటీ చేస్తానని మంత్రి జయరాం ప్రకటించడం, అందులో గుంతకల్ నియోజకవర్గం బీసీ నియోజకవర్గం గా పేరు ఉంది కాబట్టి అత్యధిక బీసీలు ఉన్నారని, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు  డేరంగుల ఉదయ్ కిరణ్ గుంతకల్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ వ్యాప్తంగా వివిధ సమస్యలపై పోరాటాలు చేశాడు. గుంతకల్ నియోజకవర్గంలో తనదైన శైలిలో రాష్ట్ర స్థాయి బీసీ బహిరంగ సభలు పెట్టి, అత్యధిక సంఖ్యలో బిసిలను ఏకం చేసి అందరిలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఆయనను మచ్చిక చేసుకొని పార్టీలో చేర్చుకొని, ప్రభుత్వం ఏర్పడంగానే పదవి ఇస్తామని  చెప్పడంతో, డేరంగుల ఉదయ్ కిరణ్ గుంతకల్ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డికి మద్దతు ఇచ్చి ఆయన విజయానికి కృషి చేశారు. గత ఎన్నికల ప్రచారంలో ముందే 50 వేల మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని స్లోగన్ కూడా ఇచ్చాడు. డేరంగుల చెప్పిన విధంగానే  అనంతపురం జిల్లాలోనే, అత్యధిక మెజార్టీతో గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి గెలుపొందిన విషయం అందరికీ తెలిసిన విషయమే! అయితే వైఎస్ఆర్సిపి పార్టీ ఆయనకు ఇప్పటిదాకా ఎలాంటి పదవి ఇవ్వకపోవడం, ఆయన పార్టీకి దూరం ఉండడం మనం చూస్తున్నాము. పార్టీ అధిష్టానం ఒకసారి టీటీడీ చైర్మన్ పదవి డేరంగులకే అని చెప్పటం, మరోసారి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి వారి వాగ్దానాన్ని వారే తుంగలో తొక్కారు. దీంతో మనస్థాపానికి గురైన దేరంగుల ఉదయ్ కిరణ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నాడు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముచ్చమటలు పట్టిచ్చేలా చంద్రబాబు  పైన పోరాటం చేశాడు. కానీ వైసీపీ ప్రభుత్వం లో ఉండి పోరాటం చేయలేకపోయాడు. బిసిలకు ఏ అన్యాయం జరిగినా వెంటనే ఉద్యమం చేస్తే వ్యక్తి, వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి ఏమి చేయలేకపోతున్నావని బీసీలంతా  కూడా బాధపడుతున్నా, ఆయన మౌనంగానే వున్నారు. ఇప్పుడు వైస్సార్సీపీ పార్టీ వీడాలని ఆయనపై బీసీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు.  వైసిపి పార్టీలో ఉంటాడా, వేరే పార్టీలోకి వెళ్తాడా అనేది ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కటం లేదు. అయితే ఒక బీసీ నేత, ఒక బీసీ సంఘం అధ్యక్షుడు  డేరంగుల ఉదయ్ కిరణ్ బిసి అభ్యర్థి మంత్రి జయరాం కు మద్దతు ఇచ్చి, గుంతకల్  నియోజకవర్గంలో ఆయనను గెలిపిస్తాడా?  లేదంటే అగ్రకుల నాయకుడైన వెంకట్రాంరెడ్డికి మద్దతు ఇచ్చి వెంకటరామిరెడ్డిని గెలిపిస్తాడా? అనేది గుంతకల్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ చర్చ ప్రజల మధ్య జరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *