పటేల్ గూడ బిజెపి విజయ సంకల్పసభలో ప్రధాని మోడీ ఆనంద పరవశం !!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నిన్న సంగారెడ్డి జిల్లా పటేల్ గూడలో జరిగిన బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడిని చూడాలని ప్రజలు ఎంతో ఓపికతో సుదూర ప్రాంతాల నుంచి ఉదయం 9 గంటలకే సభ ప్రాంగణానికి రావడం విశేషం! విశాలమైన సభా ప్రాంగణం లక్షమందికి పైగా వచ్చిన జనాలతో కిక్కిరిసి పోయింది. నరేంద్ర మోడి గారు ఉదయం 11 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి సభా ప్రాంగణం చేరుకున్నారు. ఆయనను వేదిక మీదకు పూల వర్షం కురిపిస్తూ తోడ్కొని వచ్చారు. తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళిసై ప్రధానికి స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు స్వాగతం పలికారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి, స్థానిక బిజెపి నాయకులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సుమారు 7000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఈ సభా వేదిక నుంచి వర్చువల్ గా శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మోడి తెలుగులో తమ ప్రసంగాన్ని ప్రారంభించి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రధాని మాట్లాడుతున్నంతసేపు జనాల నుంచి చప్పట్లతో ప్రతిస్పందన రావటం మోడి గారికి ఆనందాన్ని కలుగజేసింది. మెదక్ పార్లమెంట్ బిజెపి టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జన సమీకరణలో అంతా తానై ముందుండి లక్ష్యాన్ని చేధించారు. సభా ప్రాంగణం లక్ష మందికి పైగా నిండి పోవడంతో, సభా గ్రాండ్ సక్సెస్ కావడంతో బిజెపి శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీట్ బీజేపీకే దక్కుతుందని ధీమాగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *