బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో కాటా దంపతుల ప్రత్యేక పూజలు

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీన్ పూర్ మునిసిపాలిటీ బీరంగూడలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ శ్రీ కాట శ్రీనివాస్ గౌడ్ గారు మరియు వారి సతీమణి సంగా రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ గారు ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస ధీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని, సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని తెలంగాణ ప్రజలకు, పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఆ పరమేశ్వరుడిని వేడుకున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *